Asthma | న్యూయార్క్, డిసెంబర్ 14: తీవ్రమైన ఆస్తమా సమస్యలతో సతమతమయ్యేవారు ఇప్పటివరకూ ఎక్కువ మోతాదు స్టెరాయిడ్లనే వినియోగిస్తున్నారు. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, మరో మార్గం ఉండేది కాదు. దీనికి ఐరోపా పరిశోధకులు పరిష్కారాన్ని సూచించారు.
బెన్రాలిజుమాబ్ అనే ప్రొటీన్ యాంటిబాడీ థెరపీతో తీవ్రమైన ఆస్తమా కేసుల్లో దాదాపు 92 శాతం కేసుల్లో మంచి ఫలితాలు కనిపించినట్టు పేర్కొన్నారు. 200 మంది రోగులపై ఈ ప్రయోగాలు చేసినట్టు వెల్లడించారు.