Geoffrey Hinton: ఏఐ చాట్‌బాట్‌తో ప్రమాదం.. గూగుల్‌కు హింటన్ రాజీనామా
Geoffrey Hinton:ఏఐ చాట్‌బాట్స్‌తో ప్రమాదం ఉందని జెఫ్రీ హింటన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మేధావిగా భావించే హింటన్ ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థకు రాజీనామా చేశారు. ఏఐ రంగంలో జరుగుతున్న అభివృద్ధి ఆందోళనకరంగా ఉందన్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్న జెఫ్రీ హింటన్(Geoffrey Hinton).. గూగుల్ కంపెనీకి రాజీనామా చేశారు. ఏఐ చాట్‌బాట్ టెక్నాలజీతో ప్రమాదం ఉన్నట్లు ఆయన హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కీలకమైన న్యూరల్ నెట్‌వర్క్స్‌ను హింటన్ డెవలప్ చేశారు. దశాబ్ధ కాలం పాటు ఏఐ కోసం ఆయన గూగుల్‌లో పని చేశారు. కానీ ప్రస్తుతం ఏఐ అడ్వాన్స్మెంట్ కోసం జరుగుతున్న టెక్నాలజీ మార్పులు ఆందోళన కలిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. గూగుల్‌ను వదిలేసిన తర్వాత ఏఐ రిస్క్‌ల గురించి స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని హింటన్ తన ట్వీట్లో తెలిపారు. తన ఆలోచనా విధానం గూగుల్‌పై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో రిజైన్ చేసినట్లు చెప్పారు.
75 ఏళ్ల జెఫ్రీ హింటన్ తన రాజీనామా గురించి న్యూయార్క్ టైమ్స్‌తో చర్చించారు. తన పని పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఏఐ చాట్బాట్లతో ప్రమాదం ఉందని ఆయన గతంలో పలుమార్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏఐ చాట్‌బాట్ అంత ఇంటెలిజెంట్‌గా లేవని, కానీ భవిష్యత్తులో ఆ టెక్నాలజీ మరింత రాటుదేలే అవకాశం ఉందన్నారు. వయసు మీదపడడం వల్ల కూడా గూగుల్ సంస్థను వీడాల్సి వస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న చాట్‌జీపీటీ లాంటి వ్యవస్థలు ఏఐ మీదనే ఆధారపడి ఉంటాయి. అయితే అలాంటి వ్యవస్థలకు మూలమైన డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్స్‌ను హింటనే డెవలప్ చేశారు. మానవ మస్తిష్కాన్ని మించి చాట్‌బాట్ టేకోవర్ చేస్తుందని కాగ్నిటివ్ సైకాలజిస్ట్, కంప్యూటర్ సైంటిస్టు అయిన హింటన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

