గినియాలో సైనిక తిరుగుబాటు.. ప్రెసిడెంట్ అరెస్ట్
గినియా | మరో దేశంలో ప్రభుత్వం పడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని కూలదోయగా, ఆఫ్రికా దేశమైన గినియాలో ప్రత్యేక సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం

కొనాక్రీ: మరో దేశంలో ప్రభుత్వం పడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని కూలదోయగా, ఆఫ్రికా దేశమైన గినియాలో ప్రత్యేక సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. అధ్యక్షుడు ఆల్ఫా కోండేను అరెస్టు చేశారు. ఆయన ప్రభుత్వం రద్దయినట్లు ప్రకటించారు. దేశంలో కర్ఫ్యూ విధించారు. అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని నిర్ణియించినట్లు గినియా ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా ప్రకటించారు.

దేశంలో ఒక ఒకే వ్యక్తి చేతిలో రాజకీయం అనేది ముగిసింది. ఇకపై రాజకీయాలను ఒక వ్యక్తికి అప్పగించబోమని, అధికారాన్ని ప్రజలకే అందిస్తామని చెప్పారు. రాజ్యాంగం కూడా రద్దయిందని తెలిపారు. దేశ సరిహద్దులతోపాటు, ఆకాశ మార్గాలను కూడా మూసివేశాని ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దేశంలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం) క్యాబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు. దేశంలో గవర్నర్లు, ఇతర అత్యున్నత పదవుల్లో మిలటరీ అధికారులను నియమిస్తామని తెలిపారు. కాగా, దేశంలో తిరుగుబాటుకు సంబంధించి అధికారిక టెలివిజన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

కొనాక్రీలోని అధ్యక్ష భవనం వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల పరంపర గంటల తరబడి సాగినట్లు స్థానిక మీడియా తెలిపింది. సైనిక ఆక్రమణలు, తిరుగుబాటు చరిత్ర కలిగిన పశ్చిమాఫ్రికా దేశంలో భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

