నైజీరియాలో స్కూలుపై దుండగుల దాడి.. 200 మంది విద్యార్థుల కిడ్నాప్
నైజీరియా| నైజీరియాలోని ఉత్తర నైగర్ రాష్ట్రంలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలపై దాడిచేసిన దుండగులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఆదివారం టెజీనా నగరంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్యక్తులు దాడి చేశారని

నైగర్: నైజీరియాలోని ఉత్తర నైగర్ రాష్ట్రంలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలపై దాడిచేసిన దుండగులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఆదివారం టెజీనా నగరంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్యక్తులు దాడి చేశారని, సుమారు 200 మంది విద్యార్థులను ఎత్తుకెళ్లారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. మారణాయుధాలతో వచ్చిన ముష్కరులు పాఠశాలపై దాడి చేశారని పోలీస్ అధికారి వసియూ అబియోదిన్ తెలిపారు. ఈ దాడిలో ఒక వ్యక్తి మృతిచెందారని పేర్కొన్నారు. విద్యార్థులకోసం గాలింపు చర్యలు ప్రారంభించామన్నారు.
ఇటీవల నైజీరియాలోని పాఠశాలలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. డబ్బుకోసం దుండగులు స్కూళ్లపై వరుస దాడులకు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. గత ఫిబ్రవరిలో జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఓ బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. తర్వాత వారిని వదిలేశారు. ఏప్రిల్ 20న అపహరించిన 14 మంది యూనివర్సిటీ విద్యార్థులను శనివారం విడిచిపెట్టారు. నైజీరియాలో గతేడాది డిసెంబర్ నుంచి కనీసం ఆరుసార్లు ఇలాంటి కిడ్నాప్‌లు జరిగాయని, 700 మందికి పైగా విద్యార్థులు అపహరణకు గురయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

