టోక్యో: అధిక బరువు తగ్గించటంలో యాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని జపాన్‌లోని సుకుబా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. బరువును తగ్గించుకొనేందుకు చాలా మంది ఇంటర్నెట్ ఆధారిత యాప్‌లు వాడుతున్నారని, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లను వాడి శారీరక శ్రమ పెంచుతున్నారని వివరించారు. వెబ్ ఆధారిత అప్లికేషన్ల ప్రభావంపై రెండు మెడికల్ పబ్లికేషన్స్‌లో ప్రచురితమైన 1,466 ఆర్టికల్స్‌ను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. ఊబకాయులు బరువు తగ్గడంలో.. వెబ్ అప్లికేషన్లు గణనీయమైన ప్రభావాన్ని చూపాయని ప్రొఫెసర్ యోషియో తెలిపారు.