Anwaar Ul Haq Kakar | పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హాక్ కాకర్ ప్రమాణ స్వీకారం
Anwaar Ul Haq Kakar | పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఆ దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో.. ఆపద్ధర్మ ప్రధానిగా బలూచిస్థాన్‌కు చెందిన ఇండిపెండెంట్ సెనేటర్ అన్వర్ ఉల్ హాక్ కాకర్‌ను నియమించారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఆ దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో.. ఆపద్ధర్మ ప్రధానిగా బలూచిస్థాన్‌కు చెందిన ఇండిపెండెంట్ సెనేటర్ అన్వర్ ఉల్ హాక్ కాకర్‌ను నియమించారు. సోమవారం సాయంత్రం ఆయన పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అలీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇస్లామాబాద్‌లోని దేశాధ్యక్ష భవనంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
ప్రమాణస్వీకారం సందర్భంగా అన్వర్ ఉల్ హాక్.. ‘పాకిస్థాన్ ఏర్పాటుకు ఆధారమైన ఇస్లామిక్ సిద్ధాంతాన్ని కాపాడేందుకు నేను కృషి చేస్తా. ప్రభుత్వ అధికారికి నిర్ణయాల్లో నా స్వప్రయోజనాలకు తావు ఇవ్వబోను’ అని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో అన్వర్ ఉల్ హాక్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకున్నామని, ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నామని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
దేశ ఆపద్ధర్మ ప్రధానిగా నియమాకం జరగడంతో అన్వర్ ఉల్ హాక్ సెనేట్‌కు, బలూచిస్థాన్ అవామీ పార్టీ (BAP) రాజీనామా చేశారు. అన్వర్ ఉల్ హాక్ 2018లో బీఏపీని స్థాపించారు. కాగా, పాకిస్థాన్ దేశానికి అన్వర్ ఉల్ హాక్ 8వ ఆపద్ధర్మ ప్రధాని.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

