Pakistan’s caretaker PM | పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్
Pakistan's caretaker PM | పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా (Anwaar ul Haq Kakar) అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ శనివారం సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలి అన్న దానిపై చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా (Anwaar ul Haq Kakar) అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ శనివారం సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలి అన్న దానిపై చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చారు. చిన్న ప్రావిన్స్‌కు చెందిన బలూచిస్థాన్ అవామీ పార్టీ (బీఏపీ) చట్టసభ్యుడు కాకర్‌ను తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేశారు. ఆయన నియామకాన్ని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు శనివారం ప్రకటించింది.
కాగా, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ పదవీ కాలం మూడు రోజుల్లో ముగియనుండటంతో అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫార్సు చేశారు. దీంతో ఈ నెల 9న పాక్ జాతీయ అసెంబ్లీ రద్దైంది. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 90 రోజుల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అన్వర్ ఉల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

