లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలో నిరసనలు

సిడ్నీ: లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది నిరసన తెలిపారు. ‘మాకు వ్యాక్సిన్ అవసరం లేదు స్వేచ్ఛ కావాలి’ అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు. ఫ్రీడమ్.. ఫ్రీడమ్, వేకప్ ఆస్ట్రేలియా అంటూ నినాదాలు చేశారు. తమ నిరసనను స్వేచ్ఛా ర్యాలీగా పేర్కొన్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అడ్డుకోబోయిన పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సిడ్నీలో కొందరు నిరసనకారులు పెకలించిన మొక్కలు, బాటిల్స్ను పోలీసులపైకి విసిరారు. నిరసనలో పాల్గొన్న చాలా మంది మాస్కులు ధరించలేదు.
కాగా, ఇలాంటి వారే లాక్డౌన్ను మరింతగా పొడిగిస్తున్నారని న్యూ సౌత్ వేల్స్కు చెందిన పోలీస్, అత్యవసర సేవల మంత్రి డేవిడ్ ఇలియట్ విమర్శించారు. సుమారు 3,500 మంది స్వార్థపూరిత మతిలేని వ్యక్తులు సామూహిక నిరసనల్లో పాల్గొన్నారని, సుమారు 50 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఒకవైపు డెల్టా వేరియంట్ వ్యాపిస్తుండగా మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించింది. వ్యాక్సిన్ల కొరత, కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఆ దేశ జనాభాలో 21 శాతం మంది ప్రజలు మాత్రమే ఇప్పటి వరకు కరోనా టీకాలు పొందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

