వాషింగ్టన్: గత నెల అమెరికాలోని సియాటిల్ నగర కౌన్సిల్ కుల వివక్షపై నిషేధం విధించగా ఇప్పుడు కెనడాలోని టొరంటోలో కూడా కుల వివక్షపై చర్యలు మొదలయ్యాయి. కుల వివక్షకు వ్యతిరేకంగా టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(టీడీఎస్బీ) ముందుకు ఒక తీర్మానం వచ్చింది. ఈ తీర్మానాన్ని పరిశీలించాల్సిందిగా ఒంటారియో హుమన్ రైట్స్ కమిషన్కు టీడీఎస్బీ పంపించింది. అయితే, ఈ తీర్మానాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.