ఆస్ట్రేలియా ప్రధానిగా ఆల్బనీస్ ప్రమాణం.. వెంటనే టోక్యోకు ప్రయాణం
Anthony Albanese | ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ (Anthony Albanese) బాధ్యలు స్వీకరించారు. సోమవారం ఉదయం కాన్బెర్రాలో సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో 31వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. వెంటనే ఆయన జపాన్‌లోని
కాన్బెర్రా: ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ (Anthony Albanese) బాధ్యలు స్వీకరించారు. సోమవారం ఉదయం కాన్బెర్రాలో సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో 31వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. వెంటనే ఆయన జపాన్‌లోని టోక్యోకు పయణమయ్యారు. మంగళవారం నుంచి టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని మోదీ, అమెరికా, జపాన్ అధినేతలతో సమావేశం కానున్నారు. వాతావరణ మార్పులపై ప్రపంచంతో చర్చించేందుకు ఆస్ట్రేలియా సుముఖంగా ఉందని ఆల్బనీస్ వెల్లడించారు.

సోమవారం ఉదయం నిరాడంబరంగా జరిగిన ప్రమాణ స్వీకార వేడుకల్లో.. ఆల్బనీస్తోపాటు విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ట్రెజరర్ జిమ్ చామర్స్, ఆర్థిక మంత్రి కాటీ గల్లాఘర్ బాధ్యతలు స్వీకరించారు.
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లోని 151 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. శనివారం ఓట్లు లెక్కించగా.. మాజి ప్రధాని స్కాట్ మారిసన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమికి 51 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆంటోనీ పార్టీ 72 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే అధికారం చేపట్టేందుకు సింగిల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ (76) రాకపోయినా.. స్వతంత్రులుగా ఎన్నికైన వారి మద్దతుతో ఆంటోనీ ఆల్బనీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

