ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆంటోని అల్బనీస్
Anthony Albanese | ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆంటోని అల్బనీస్ (Anthony Albanese) ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మారిసన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమిపై
సిడ్నీ: ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆంటోని అల్బనీస్ (Anthony Albanese) ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మారిసన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమిపై విపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 151 స్థానాలకుగాను 72 స్థానాల్లో గెలుపొందింది. మారిసన్ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమితం కాగా, ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. దీంతో ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా ఆంటోని బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తన ఓటమిని అంగీకరించారు. అల్బనీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2007 తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి.

అల్బనీస్ 1963లో జన్మించారు. 1996తో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2013లో ఉప ప్రధానిగా కొంతకాలం పనిచేశారు. 2019 నుంచి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్‌కు పీఎం మోదీ అభినందనలు తెలిపారు. అల్బనీస్ సర్కారుతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇరుదేశాల ప్రయోజనాలపై కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

