టొరంటో : కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్‌లో బీఏపీఎస్ స్వామినారాయణ దేవాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆలయ గోడలపై హిందూ, భారత వ్యతిరేక నినాదాలు రాశారు.
ఇది విద్వేషపూరిత దాడిగానే అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు దేవాలయం వద్దకు వచ్చారని, ఒక వ్యక్తి ఆలయ గోడలపై ద్వేషపూరిత రాతలు రాశాడని సీసీ టీవీలో రికార్డయ్యిందని చెప్పారు.