Andy Burnham | బ్రిటన్ నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. పదేళ్లలో దేశానికి ఏడో ప్రధాని
Andy Burnham : బ్రిటన్ నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ప్రధానిగా కొనసాగిన కీర్ స్టార్మర్ సోమవారం అధికారికంగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రిన్స్ కింగ్ ఛార్లెస్ 3కి తన రాజీనామా సమర్పించారు.
Andy Burnham : బ్రిటన్ నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ప్రధానిగా కొనసాగిన కీర్ స్టార్మర్ సోమవారం అధికారికంగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రిన్స్ కింగ్ ఛార్లెస్ 3కి తన రాజీనామా సమర్పించారు. అనంతరం 10 డౌన్స్ట్రీట్లో తన చివరి ప్రసంగం చేశారు. తాను ప్రధాని పదవి నుంచి సంతోషంగా వైదొలుగుతున్నట్లు స్టార్మర్ చెప్పారు. తన తర్వాత ఆండీ బర్న్‌హామ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
ఆండీకి మద్దతు ఇవ్వాలని తన సన్నిహితులను, బ్రిటన్ ప్రజలను స్టార్మర్ కోరారు. దీంతో ఆండీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా కింగ్ ఛార్లెస్-3 సోమవారం ఆండీ బర్న్‌హామ్‌ను ఆహ్వానించారు. ఆండీ ఈ వారమే ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. అనంతరం ఆయన తన మంత్రివర్గాన్ని నియమించుకుని, పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ బాధ్యతలు స్వీకరిస్తారు. లేబర్ పార్టీ తరఫున స్టార్మర్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రధానిగా ఆండీని ఆ పార్టీ నియమించింది. ఎలాంటి ఓటింగ్ లేకుడానే ఆయనను ప్రధానిగా ఎన్నుకున్నారు.
ఆండీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే.. పదేళ్లలో బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన ఏడో వ్యక్తిగా నిలుస్తారు. ఇలా బ్రిటన్‌లో పదేళ్లలో ఏడుగురు ప్రధానులు మారడం అరుదైన విషయం. 56 ఏళ్ల ఆండీ.. ప్రస్తుతం గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఉన్నారు. ఆయనను కింగ్ ఆఫ్ ద నార్త్ అని పిలుస్తారు. లేబర్ పార్టీలో స్టార్మర్‌కు ధీటైన నేతగా ఆండీకి పేరుంది. అయితే, ఆయనకు అక్కడి ప్రజలకు అంతగా పరిచయం లేదు. ముఖ్యంగా తన మేయర్ పరిధి దాటి తెలిసేది చాలా తక్కువ. బాధ్యతాయుతమై, స్థిరమైన రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని ఆండీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలపై ద్రుష్టి సారిస్తారని, ముఖ్యంగా బ్రిటన్ ప్రజలకు జీవన వ్యయాన్ని తగ్గించమే లక్ష్యమని ఆండీ కార్యాలయం తెలిపింది. మొదటి 100 రోజుల్లో ఆయన ఎలాంటి పాలన అందిస్తారు అనే దానిపై ఆండీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇక, ఆండీ భారత్ విషయంలో సానుకూలంగా ఉంటారనే ప్రచారం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

