Viral Video: అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏమవుతుంది?
అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. అక్కడ భూమిపైలాగా జీవించడం కుదరదు. అందుకే అంతరిక్షంలో నివసించే వ్యోమగాముల జీవితానికి సంబంధించిన ఏదైనా మనకు వింతగానే ఉంటుంది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని వ్యోమగాముల జీవితాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తరచుగా మనకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA)కి చెందిన వ్యోమగామి క్రిస్ హాడ్ఫీల్డ్ ఐఎస్ఎస్ వద్ద తడి టవల్‌తో చేసిన సాధారణ ప్రయోగానికి సంబంధించిన వీడియోను నాసా విడుదల చేయగా, వైరల్‌గా మారింది.

ఈ వీడియోను నాసా వాస్తవానికి 2013లో విడుదల చేసింది. అయితే, ఇటీవలే ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. “అంతరిక్షంలో తేలుతున్నప్పుడు తడి టవల్ని బయటకు తీస్తే ఇది జరుగుతుంది” అనే శీర్షికతో వండర్ ఆఫ్ సైన్స్ పేజీ ద్వారా దీన్ని ట్వీట్ చేశారు. క్రిస్ తడి వాష్‌క్లాత్‌ని తీసుకొని రెండు చేతులతో పిండుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల టవల్ నుంచి విడుదలయ్యే నీరు నేలపై పడదు. బదులుగా, అది దాని చుట్టూ ‘ట్యూబ్’ని ఏర్పరుస్తుంది. కాగా, క్రిస్ అంతరిక్షంలో ఎక్స్ట్రావెహిక్యులర్ యాక్టివిటీ చేసిన మొదటి కెనడియన్‌గా పేరుగాంచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. వీడియో చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.
This is what happens when you wring out a wet towel while floating in space.
Credit: CSA/NASA pic.twitter.com/yTZclq9bCJ
— Wonder of Science (@wonderofscience) June 21, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!