women raped, burnt alive | కాంగోలో దారుణం.. వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం, సజీవ దహనం
women raped, burnt alive | మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
కిన్షాసా: మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశారు. (women raped, burnt alive) మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటు గ్రూపులు కాంగో నగరంలోకి ప్రవేశించాయి. జనవరి 27న గోమాలోకి చొరబడ్డారు. తిరుగుబాటుదారులు ముంజెంజ్ జైలుపై దాడి చేశారు. తమ వర్గం వారిని విడిపించారు.
కాగా, ఈ సందర్భంగా ఆ జైలులోని మగ ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. అయితే మహిళా ఖైదీలపై తిరుగుబాటుదారులు అత్యాచారాలకు పాల్పడ్డారు. వారిని బంధించిన కొన్ని గదులకు నిప్పంటించారు. దీంతో వందలాది మహిళా ఖైదీలు సజీవ దహనమయ్యారు.
మరోవైపు ఈ సంఘర్షణలో సామూహిక అత్యాచారాలు, లైంగిక హింస, దారుణ మరణశిక్షలు, నిరాశ్రయ శిబిరాలపై బాంబు దాడులు వంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస) హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. తిరుగుబాటుదారుల ఆంక్షల కారణంగా ఐరాస శాంతి పరిరక్షకులు ఆ జైలులోకి ప్రవేశించలేకపోయినట్లు పేర్కొంది.
కాగా, ఆ జైలు నుంచి పొగలు, ఖైదీలు తప్పించుకోవడం, వందలాది కాలిన మృతదేహాలను రెడ్క్రాస్ సిబ్బంది వాహనాల్లో తరలించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
🇨🇩 Goma : Évasion à la prison de Munzenze pic.twitter.com/TXzNfvC8hu
— The Voice Of Congo (@VoiceOfCongo) January 27, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

