Israel-Hamas war | ఇజ్రాయెల్‌పై ‘పవిత్ర యుద్ధం’లో త్యాగాలకు సిద్ధం: హిజ్బుల్లా చీఫ్
Israel-Hamas war | ఇజ్రాయెల్‌పై ‘పవిత్ర యుద్ధం’లో త్యాగాలకు సిద్ధమయ్యామని లెబనాన్‌లో మిలిటెంట్ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా చీఫ్ (Hezbollah chief) సయ్యద్ హసన్ నస్రల్లా తెలిపారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై సుమారు నెల రోజులవుతున్న తరుణంలో శుక్రవారం ఆయన తొలిసారి బహిరంగంగా టీవీలో ప్రసంగించారు.
బీరుట్: ఇజ్రాయెల్‌పై ‘పవిత్ర యుద్ధం’లో త్యాగాలకు సిద్ధమయ్యామని లెబనాన్‌లో మిలిటెంట్ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా చీఫ్ (Hezbollah chief) సయ్యద్ హసన్ నస్రల్లా తెలిపారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై సుమారు నెల రోజులవుతున్న తరుణంలో శుక్రవారం ఆయన తొలిసారి బహిరంగంగా టీవీలో ప్రసంగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడిని ఆయన సమర్థించారు. హమాస్ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ నిర్ణయం వంద శాతం పాలస్తీన్లదే అని తెలిపారు. పాలస్తీనా భూభాగం, పాలస్తీనా ప్రజల కోసమే హమాస్ యుద్ధమని అన్నారు. ప్రాంతీయ సమస్యతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
కాగా, అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి ఇజ్రాయెల్‌లో భూకంపం సృష్టించిందని హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా అభివర్ణించారు. ‘హమాస్ నిర్ణయం సరైనది, తెలివైనది, ధైర్యంతో కూడుకున్నది, సరైన సమయంలో జరిగింది’ అని వ్యాఖ్యానించారు. హమాస్‌పై దాడి మొదలై నెలవుతున్నా ఇజ్రాయెల్ ఒక్క మిలిటరీ విజయాన్ని సాధించలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్ చర్చల ద్వారా మాత్రమే బంధీలను తిరిగి పొందగలదని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు, పౌరుల మరణాలకు అమెరికా కారణమని ఆరోపించారు.
మరోవైపు ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య శుక్రవారం దాడులు జరుగడంతోపాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌ను సందర్శించిన నేపథ్యంలో హిజ్బుల్లా చీఫ్ తొలిసారి బహిరంగంగా ప్రసంగించడం ప్రాధానత్య సంతరించుకున్నది. అలాగే నస్రల్లా టెలివిజన్ ప్రసంగాన్ని వినేందుకు లెబనాన్ ప్రజలు ఆసక్తి చూపారు. శుక్రవారం రాజధాని బీరూట్‌లోని ఒక చౌరస్తా వేలాది మందితో నిండిపోయింది. హిజ్బుల్లా చీఫ్ తొలి ప్రసంగం సందర్భంగా తుపాకీ కాల్పులు కూడా మారుమోగాయి. ఆయన ప్రసంగంతో హమాస్, ఇజ్రాయెల్ వార్ ప్రాంతీయంగా విస్తరించవచ్చని యుద్ధ నిఫుణులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

