US-Iran talks | అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం.. అర్ధాంతరంగా చర్చలు ముగించి వెళ్లిపోయిన జేడీ వాన్స్ బృందం
పశ్చిమాసియా యుద్ధాన్ని(US-Iran war) ముగించేందుకు చేపట్టిన చర్యలు విఫలమైనట్లుగా కనిపిస్తున్నది.
హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ధాన్ని(US-Iran war) ముగించేందుకు చేపట్టిన చర్యలు విఫలమైనట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపచేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన ప్రతిష్టంభన తొలగించి శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్‌లో ఇరాన్ ప్రతినిధులతో చారిత్రాత్మక ముఖాముఖీ చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని జేడీ వాన్స్ తెలుపడంతో ఆందోళన కలిగిస్తున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిబంధనలు అంగీకరించేందకు ఇరాన్ ఏమాత్రం సిద్ధంగా లేదని జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు.
ఆ దేశం నుంచి సానుకూలమైన వాతావరణం కనిపించడం లేదని ఆరోపించారు. ఇరాన్ ప్రతినిధులతో 21 గంటలు చర్చలు జరిపాం. ఇది చాలా చేదు వార్త అని..చర్చల్లో ఎలాంటి ఒప్పందం లేకుండానే అర్ధాంతరంగా వెనుదిరిగి వెళ్లడం బాధగా ఉందన్నారు. ఈ విషయంలో అమెరికాకంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం అన్నారు. కాగా, చర్చల ద్వారా కీలక పురోగతి సాధిస్తారనే అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రకటన తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని పలవురు రాజకీయ విశ్లేషకులు అన్నారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

