వీళ్లంతా మా శత్రువులే.. శత్రు దేశాల జాబితాను విడుదల చేసిన పుతిన్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే వుంది. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే వుంది. అంతర్జాతీయ సమాజం మొత్తుకుంటున్నా… పుతిన్ మాత్రం ఎవ్వరి మాటా వినడం లేదు. ఉక్రెయిన్ తమ దారిలోకి వచ్చేంత వరకూ బాంబుల వర్షం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు మరో సంచలన విషయం ప్రకటించారు. తమ శత్రు దేశాల జాబితాను పుతిన్ విడుదల చేశారు. బ్రిటన్‌తో సహా అందులో 31 దేశాలున్నాయి. ఈ విషయాన్ని రష్యా మీడియా వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, ఉక్రెయిన్, జపాన్‌తో సహా యూరోపియన్ దేశాలను పుతిన్ తమ శత్రు దేశాలుగా ప్రకటించేశారు. యూరోపియన్ దేశాల్లో మొత్తం 27 దేశాలున్నాయి.
అమెరికా : రష్యాపై అమెరికా అనేక ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధంచాలని మరికొన్ని దేశాలకు కూడా సూచించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రిని కూడా అమెరికాలోకి రానివ్వకుండా జోబైడెన్ నిషేధం విధించారు. దీంతో పాటు రష్యాకు సంబంధించిన బ్యాంకులపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇక.. రష్యా విమానాలు తమ గగనతలంలోకి రాకుండా అమెరికా నిషేధం కూడా విధించింది.
బ్రిటన్ : రష్యాకు చెందిన ఐదు బ్యాంకులు, కుబేరులపై బ్రిటన్ ఆర్థిక ఆంక్షలను విధించింది. రష్యా ప్రభుత్వ అధీనంలో ఉండే ఎయిరోలోఫ్ట్ కంపెనీకి చెందిన విమానాలపై నిషేధం విధించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.
ఉక్రెయిన్ : ఈ దేశంతో రష్యా ఇప్పటికే యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పౌర నివాసాలపై కూడా రష్యా బాంబు దాడులు చేస్తోంది. తమ దారిలోకి వచ్చేంత వరకూ యుద్ధం కొనసాగుతుందని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.
యూరోపియన్ యూనియన్ దేశాలు : ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో యూరోపియన్ దేశాలు తీవ్రంగా ఖండిచాయి. రష్యాపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఆర్థిక ఆంక్షలను కూడా విధించాయి. రష్యా విమానాలు తమ గగనతలంలోకి రావొద్దని తేల్చి చెప్పాయి. ఇక.. తమ దేశంలో ఉన్న రష్యా కుబేరుల అకౌంట్లను కూడా సీజ్ చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

