America | రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తున్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఆయుధాలను సరఫరా చేసిన అగ్రరాజ్యంగా.. తాజాగా నాలుగు నౌకల ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. భారీగా ఆయుధాలను యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ పంపుతున్నది. ఆ ఆయుధాలను అమెరికా నేవీ స్వాధీనం చేసుకున్నది. యూఎస్ నేవి వేలల్లో అసాల్ట్ రైఫిల్స్, మిలియన్ కంటే ఎక్కువ రౌండ్స్ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. గతేడాది నుంచి బైడెన్ పరిపాలన స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చట్టబద్ధంగా ఉక్రెయిన్ సైన్యానికి పంపేందుకు సిద్ధం చేస్తున్నది.
ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ఇరాన్ నుంచి స్వాధీనం చేసుకున్న 5వేలకుపైగా ఏకే-47లు, రాకెట్ లాంచర్లు, వేల రౌండ్ల మందుగుండు సామగ్రిని పంపుతున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రమైన ఆయుధాలు, సామగ్రి కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. మరిన్ని నిధులను ఆమోదించే వరకు సొంత నిల్వ నుంచి యుద్ధ సామగ్రి పంపలేమని యూఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ఏప్రిల్ 4న ప్రభుత్వం ఉక్రెయిన్ సాయుధ దళాలకు 5వేలకుపైగా AK-47 మెషిన్ గన్లు, స్నిపర్ రైఫిల్స్, ఆపీజీ-4, ఐదులక్షల రౌండ్ల మందుగుండు సామగ్రిని పంపిణీ చేసిందని తెలిపింది. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ను రక్షించేందుకు ఈ ఆయుధాలు దోహదపడతాయని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అమెరికా సైన్యం 2021 మే 22 నుంచి 2023 ఫిబ్రవరి 15 మధ్య నాలుగు నౌకల నుంచి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నది.