Pope Leo XIV | నూతన పోప్‌గా రాబర్ట్ ప్రివోస్ట్.. ఆ పదవి చేపట్టిన తొలి అమెరికన్‌గా రికార్డు
Pope Leo XIV | కేథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్ గురువారం ఎన్నికయ్యారు. ఆయనను ఇకపై లియో 14 అని పిలుస్తారు. 2,000 సంవత్సరాల చర్చి చరిత్రలో ఈ స్థానానికి చేరుకున్న తొలి అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
Pope Leo XIV | వాటికన్ సిటీ: కేథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్ గురువారం ఎన్నికయ్యారు. ఆయనను ఇకపై లియో 14 అని పిలుస్తారు. 2,000 సంవత్సరాల చర్చి చరిత్రలో ఈ స్థానానికి చేరుకున్న తొలి అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. కేథలిక్ చర్చ్‌కి 140 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. నూతన పోప్‌ను ఎన్నుకోవడం కోసం 133 మంది కార్డినల్స్ ఓట్లు వేశారు. ఈ ఎన్నికలో రాబర్ట్ విజేతగా నిలిచారు. దీనికి సంకేతంగా సిస్టిన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లని పొగ వెలువడింది. ఈ ఎన్నికను ప్రకటించిన 70 నిమిషాల తర్వాత నూతన పోప్ లియో సెయింట్ పీటర్స్ బసిలికా సెంట్రల్ బాల్కనీలో విశ్వాసులకు దర్శనమిచ్చారు.
ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మంబెర్టి నూతన పోప్ ఎన్నికైనట్లు ప్రకటించారు. “హబెముస్ పపమ్” (మనకు పోప్ వచ్చారు) అని చెప్పారు. సెయింట్ పీటర్స్ స్కేర్‌లో వేలాదిమంది ఈ ప్రకటనతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పోప్ లియో (69) షికాగోకు చెందినవారు. ఆయన తన జీవితంలో అత్యధిక భాగం పెరూ మిషనరీలో పని చేశారు. 2023లో కార్డినల్ అయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత రాబర్ట్ 267వ కేథలిక్ పోప్‌గా ఎన్నికయ్యారు. పోప్ లియో ఇచ్చిన తొలి సందేశంలో, “మీకు శాంతి కలుగుతుంది” అని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

