Ukraine drone attacks | ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులు.. మాస్కోలో విమానాశ్రయాల మూసివేత
Ukraine drone attacks | ఉక్రెయిన్ రోజు రోజుకు డ్రోన్ దాడులను(Ukraine drone attacks) విస్తరిస్తోంది. తన సరిహద్దుల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కోను టార్గెట్‌గా చేసుకొని భీకర దాడులకు పాల్పడుతోంది.
Ukraine drone attacks | ఉక్రెయిన్ రోజు రోజుకు డ్రోన్ దాడులను(Ukraine drone attacks) విస్తరిస్తోంది. తన సరిహద్దుల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కోను టార్గెట్‌గా చేసుకొని భీకర దాడులకు పాల్పడుతోంది. గత నెల రోజుల నుంచి ఉక్రెయిన్ రష్యాపై(Russia) డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా చమురు శుద్ధి కర్మాగారాలు , ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదే క్రమంలో గురువారం రష్యా రాజధాని మాస్కోపై అతి పెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది.
మాస్కోలోని ఆయిల్ రిఫైనరీకి సమీపంలో దాడికి పాల్పడటం గమనార్హం. దీంతో అప్రమత్తమైన రష్యా అధికారులు మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలలో విమాన సర్వీసులను(Airports closed) తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో మాస్కోలోని అత్యంత రద్దీగా ఉండే షెరెమెటివో విమానాశ్రయం నుండి ప్రయాణికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక విమానాలను దారి మళ్లించారు.
మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ మాట్లాడుతూ..ఉక్రెయిన్ దాడులు నిజమేనని దాదాపు 180 డ్రోన్లను మాస్కో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చి వేసినట్లు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా 500 డ్రోన్లు కూల్చివేసినట్లు వివరాలను వెల్లడించారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కజాన్ నగరంలో ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

