Air Canada Plane Diverted | కుటుంబ వ్యక్తిపై యువకుడు దాడి.. విమానం దారి మళ్లింపు
Air Canada Plane Diverted | విమానం గాలిలో ఉండగా కుటుంబ వ్యక్తిపై 16 ఏళ్ల యువకుడు దాడి చేశాడు. దీంతో విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు అతడ్ని అడ్డుకుని నిర్బంధించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని దారి మళ్లించారు.
టొరంటో: విమానం గాలిలో ఉండగా కుటుంబ వ్యక్తిపై 16 ఏళ్ల యువకుడు దాడి చేశాడు. దీంతో విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు అతడ్ని అడ్డుకుని నిర్బంధించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని దారి మళ్లించారు. (Air Canada Plane Diverted) కెనడాలో ఈ సంఘటన జరిగింది. ఎయిర్ కెనడాకు చెందిన 137 విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరింది. అయితే ఆ విమానం గాలిలో ఉండగా 16 ఏళ్ల యువకుడు వింతగా ప్రవర్తించాడు. ఉన్నట్టుండి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని దారుణంగా కొట్టాడు. విమాన సిబ్బందితో పాటు మిగతా ప్రయాణికులు వెంటనే స్పందించారు. ఆ యువకుడ్ని అడ్డుకుని నిర్బంధించారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందించారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని దారి మళ్లించారు. విన్నిపెగ్ రిచర్డ్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దానిని ల్యాండ్ చేశారు. విమానంలో వింతగా ప్రవర్తించడంతోపాటు కుటుంబానికి చెందిన వ్యక్తిపై దాడి చేసిన యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన వల్ల విమానం దారి మళ్లడంతో మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. ఈ నేపథ్యంలో మిగతా విమాన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

