కేంబ్రిడ్జి: యుద్ధ విమానాల్లోని కాక్‌పిట్‌లో దూరి కృత్రిమ మేధ అద్భుతాలు చేయగలదా? అంటే అమెరికా ఇంజినీర్లు అవునంటున్నారు. ‘టాప్ గన్ మావెరిక్’ సినిమా నుంచి ప్రేరణ పొందిన మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీర్లు.. మానవ ప్రమేయం లేకుండా ఫైటర్ జెట్‌ను నడిపే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. భూమికి అత్యంత తక్కువ ఎత్తులో ఇరుకైన రాతి లోయలగుండా విమానం ప్రయాణించినా క్రాష్ కాకుండా విమానాన్ని డిజైన్ చేశారు. ఈ స్థితిలో లక్ష్యంపై దాడి చేస్తున్నప్పుడు ఫైటర్ జెట్ అడ్డంకులను అధిగమించి, స్థిరంగా ఉండేలా డీప్ రీఇన్ఫోర్స్మెంట్ లర్నింగ్ అల్గారిథమ్‌ను వినియోగించారు. ఈ ఫైటర్ జెట్‌ను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించగా, విజయవంతంగా లక్ష్యంపై గురి పెట్టింది.