Garfield AI | న్యాయరంగంలో చరిత్ర సృష్టించిన కృత్రిమ మేథ.. న్యాయవాదులతో పోటీపడి కేసు గెలుపు
Garfield AI | న్యాయరంగంలో కృత్రిమ మేథ (Artificial Inteeligence) కొత్త చరిత్ర సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన గార్ఫీల్డ్ ఏఐ (Garfield AI) అనే ఏఐ ఆధారిత న్యాయసంస్థ.. న్యాయవాదులతో పోటీపడి కోర్టు కేసులో విజయం సాధించింది. ప్రపంచంలో ఏఐ ఆధారిత న్యాయసంస్థ నేరుగా గెలిచిన తొలి కేసుగా దీనిని భావిస్తున్నారు.
Garfield AI : న్యాయరంగంలో కృత్రిమ మేథ (Artificial Inteeligence) కొత్త చరిత్ర సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన గార్ఫీల్డ్ ఏఐ (Garfield AI) అనే ఏఐ ఆధారిత న్యాయసంస్థ.. న్యాయవాదులతో పోటీపడి కోర్టు కేసులో విజయం సాధించింది. ప్రపంచంలో ఏఐ ఆధారిత న్యాయసంస్థ నేరుగా గెలిచిన తొలి కేసుగా దీనిని భావిస్తున్నారు. ఫ్రీలాన్స్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ టామిరెస్ కమల్ టాక్విడిర్‌కు ఒక హాస్పిటాలిటీ సంస్థ చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టింది. దాంతో గార్ఫీల్డ్ ఏఐ సంస్థను ఆశ్రయించి ఆ సంస్థ సేవలను ఆమె పొందింది.
కేవలం 400 పౌండ్ల (సుమారు రూ.50 వేలు) ఫీజుతో గార్ఫీల్డ్ ఏఐ సంస్థ ఈ సేవలు అందించింది. ఏఐ సాయంతో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర న్యాయపరమైన డాక్యుమెంట్లన్నీ గార్ఫీల్డ్ ఏఐ సంస్థ సిద్ధం చేసింది. విచారణ వేళ ఒక మానవ న్యాయవాదిని కోర్టులో వాదనలు వినిపించేందుకు నియమించింది. లండన్‌లోని వాండ్స్‌వర్త్ కౌంటీ కోర్టులో దాదాపు మూడు గంటలపాటు విచారణ జరిగింది. ఇరుపక్షాల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
చివరికి కోర్టు టాక్విడిర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెకు 7,000 పౌండ్లు (సుమారు రూ.8.8 లక్షలు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యర్థి సంస్థ దాఖలు చేసిన కౌంటర్ క్లెయిమ్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. గార్ఫీల్డ్ ఏఐ సహ వ్యవస్థాపకుడు ఫిలిప్ యంగ్ దీన్ని న్యాయరంగంలో గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. ఏఐ సాయంతో న్యాయసేవలు మరింత తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం గార్ఫీల్డ్ ఏఐ 10 వేల పౌండ్ల (సుమారు రూ.12.5 లక్షలు) వరకు ఉన్న చిన్న క్లెయిమ్ కేసులను స్వీకరిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

