లాటిన్ అమెరికా గగనతలంలోనూ చైనా నిఘా బెలూన్.. ప్రకటించిన పెంటగాన్
అమెరికా గగన తలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ (Spy balloon) కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హై ఆల్టిట్యూడ్ బెలూన్ను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ గుర్తించింది.
వాషింగ్టన్: అమెరికా గగన తలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ (Spy balloon) కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హై ఆల్టిట్యూడ్ బెలూన్ను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ గుర్తించింది. ఇది తమ పొరుగునే ఉన్న లాటిన్ అమెరికా గగనతలంలో ఎగురుతున్నదని వెల్లడించింది. దానిని చైనాకు సంబంధించిన నిఘా బెలుగా గుర్తించినట్లు పెంటగాన్ ప్రెస్ కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ పాట్రిక్ రైడర్ తెలిపారు. అయితే అది కచ్చితంగా ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. అది అమెరికా దిశగా కదులుతున్నట్లు కనిపించడంలేదని చెప్పారు. మరికొన్ని రోజుల్లో తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు.
కొన్ని రోజుల నుంచి తమ దేశ గగన తలంపై చైనా ‘నిఘా బెలూన్’ ఎగురుతున్నదని అమెరికా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థన మేరకు దీన్ని కూల్చేయాలని రక్షణ కార్యదర్శి ఆస్టిన్ అనుకున్నా, కింద ఉండే చాలా మంది ప్రజలకు దాని వల్ల ప్రమాదం కలుగుతుందని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారు. వాయువ్య అమెరికాలోని భూ గర్భంలో సున్నితమైన ఎయిర్‌బేస్‌లు, వ్యూహాత్మక అణు క్షిపణులు ఉన్న ప్రాంతంలో చైనా బెలూన్ ఎగురుతున్నదని అమెరికా అధికారులు తెలిపారు. ఇంటలిజెన్స్ సమాచార సేకరణలో ఈ బెలూన్‌కు తక్కువ సామర్థ్యం ఉన్నట్టు తెలుసుకున్నామని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

