టిక్‌టాక్‌పై భారత్, కెనడా బ్యాన్..ఇరకాటంలో బైట్‌డ్యాన్స్..!
చైనాకు చెందిన యాప్ టిక్‌టాక్‌ను భారత్ నిషేధించిన అనంతరం మరో దేశం ఈ సోషల్ మీడియా యాప్‌ను బ్యాన్ చేసింది. భద్రతా పరమైన కారణాలతో టిక్‌టాక్‌ను నిషేధించినట్టు కెనడా ప్రకటించింది.
టొరంటో : టిక్‌టాక్ యాప్‌ను పలు దేశాలు నిషేధిస్తుండటంతో చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ ప్రమోటర్ బైట్ డ్యాన్స్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ యాప్‌ను ఇప్పటికే భారత్ నిషేధించగా తాజాగా కెనడా సైతం భద్రతాపరమైన కారణాలు చూపుతూ బ్యాన్ చేయడంతో ఈ జాబితాలో మరికొన్ని దేశాలు చేరతాయని భావిస్తున్నారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌ను భారత్ నిషేధించిన అనంతరం మరో దేశం ఈ సోషల్ మీడియా యాప్‌ను బ్యాన్ చేసింది. భద్రతా పరమైన కారణాలతో టిక్‌టాక్‌ను నిషేధించినట్టు కెనడా ప్రకటించింది. చైనా ప్రభుత్వం తమ యూజర్ డేటాను యాక్సెస్ చేస్తుందనే ఆందోళనతో టిక్‌టాక్‌ను కెనడా బ్యాన్ చేసింది. ఆన్లైన్లో కెనడియన్ల భద్రత కోసం చేపట్టే చర్యల్లో భాగంగా చైనీస్ యాప్ టిక్‌టాక్‌పై కెనడా ప్రభుత్వం నిషేధం విధించిందని చెబుతున్నారు.
గోప్యత, భద్రతకు ఎదురయ్యే ముప్పులను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది. కెనడియన్ల ఆన్లైన్ భద్రత కోసం కెనడా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న క్రమంలో తాజా నిర్ణయం వెలుగుచూసింది. కెనడా ప్రజలు ఆన్లైన్లో సురక్షితంగా ఉండేలా తీసుకున్న చర్యల్లో ఇది కీలకమైనదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఈ బ్యాన్ తక్షణం అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్‌ను రాబోయే రోజుల్లో డౌన్లోడ్ చేసుకోలేరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. టిక్‌టాక్ డేటా కలెక్షన్ పద్ధతులు ఫోన్ కంటెంట్స్కు యాక్సెస్ కల్పిస్తున్నాయని ట్రెజరీ బోర్డు పేర్కొంది.
ఈ యాప్ వాడటంతో ముప్పు అధికమని స్పష్టమైందని, అయితే ప్రభుత్వ సమాచారం ప్రమాదంలో పడిందనేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవని ట్రెజరీ బోర్డు చీఫ్ మోనా ఫోర్టిర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చైనీస్ యాప్‌తో ఎదురవుతున్న ప్రైవసీ, భద్రతా ముప్పులపై ఆందోళన నేపధ్యంలో ప్రభుత్వం జారీ చేసిన డివైజ్‌ల్లో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ కెనడా నిర్ణయం తీసుకుంది. భారత్, కెనడాల బాటలోనే ఇతర దేశాలు సైతం ప్రముఖ సోషల్ మీడియా యాప్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Read More :
Kiss | ఇక ఫోన్లోనే లిప్ కిస్ పెట్టేయొచ్చు.. ప్రేమికుల కోసం చైనా వినూత్న ఆవిష్కరణ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

