ఈ ఫొటోలో క్యాబ్ నడుపుతున్న వ్యక్తి ఖాలిద్ పయండా. ఈయన ఒకప్పుడు అఫ్గానిస్థాన్ ఆర్థిక మంత్రి. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు అమెరికాలోని వాషింగ్టన్ వీధుల్లో
క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకోవడానికి
ముందు దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారు.