క్యాబ్ డ్రైవర్‌గా ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి
Khalid Payenda | అతడు ఆరు నెలల క్రితం ఓ దేశానికి ఆర్థిక మంత్రి. తిరిగిచూస్తే అమెరికాలోని వాషింగ్టన్ రోడ్లపై క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆరు బిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్ పర్యవేక్షించాడు. ఇప్పుడు ఆరుగంటల పాటు శ్రమించి 150 డాలర్లు సంపాదిస్తు్న్నాడు. ఇదీ తాలీబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయెండా (Khalid Payenda) పరిస్థితి.
వాషింగ్టన్: అతడు ఆరు నెలల క్రితం ఓ దేశానికి ఆర్థిక మంత్రి. తిరిగిచూస్తే అమెరికాలోని వాషింగ్టన్ రోడ్లపై క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆరు బిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్ పర్యవేక్షించాడు. ఇప్పుడు ఆరుగంటల పాటు శ్రమించి 150 డాలర్లు సంపాదిస్తు్న్నాడు. ఇదీ తాలీబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయెండా (Khalid Payenda) పరిస్థితి.
ఖలీద్ పయెండా.. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అమెరికా సహకారంతో వేల కోట్ల బడ్జెట్‌కు పర్యవేక్షకుడిగా ఉన్నాడు. అయితే తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాబూల్ ఆక్రమణకు వారం రోజుల ముందే తన పదవికి రాజీనామ చేసిన ఖలీద్.. అమెరికా వెళ్లిపోయాడు. అప్పటికే అక్కడ ఉన్న తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు సొమ్ము వెనకేసుకోలేదో ఏమో పాపం.. వాషింగ్టన్లో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఒకప్పుడు 6 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆఫ్ఘన్ బడ్జెట్‌కు బాధ్యుడిగా ఉన్న ఆయన.. రోజు ఆరుగంటలపాటు కారు నడి 150 డాలర్లు సంపాదిస్తున్నాడు. దీంతోపాటు జార్జ్‌టౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారెన్ సర్వీసెస్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, తనకు ప్రస్తుతం ఓ ప్లేస్ అంటూ లేకుండా పోయిందని వాపోయాడు. నేను ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ గానీ, అమెరికాకు గానీ చెందినవాడిని కాదు.. నాదీ అని చెప్పుకోవడానికి నాకు ఓ ప్లేస్ అంటూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అఫ్ఘన్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోలేపోయాని చెప్పాడు. దేశంలో ప్రజస్వామ్యాన్ని నిలబెడ్డటంలో విఫమయ్యామని ఒప్పుకున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

