నాలుగు కార్లు, హెలికాఫ్టర్‌లో డబ్బు నింపుకుని కాబూల్ వీడిన అష్రఫ్ ఘనీ!

మాస్కో : కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్ష భవనం నుంచి ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు నాలుగు కార్లు, విమానం నిండా డబ్బుతో దేశం విడిచివెళ్లాడని కాబూల్‌లో రష్యా రాయబారి సోమవారం వెల్లడించారు. కార్లు, విమానం నిండా నగదును నింపుకుని వాటిలో స్ధలం లేక ఇక మరికొంత నగదును పడవేసి వెళ్లాడని చెప్పారు.
తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఆదివారం ఘనీ దేశం విడిచివెళ్లాడని ఆర్ఐఏ వార్తాసంస్థ వెల్లడించింది. రక్తపాతాన్ని నివారించేందుకే తాను కాబూల్‌ను విడిచివెళ్లానని ఆ తర్వాత ఘనీ ప్రకటించారు. కాగా ఘనీ భారీ నగదుతో దేశాన్ని వీడారని రష్యా రాయబారి చేసిన వ్యాఖ్యలను రష్యన్ రాయబారి ప్రతినిధి ఇషెంకో నిర్ధారించారు.
ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని రాయ్‌టర్స్ వార్తాసంస్థకు తెలిపారు. మరోవైపు కాబూల్‌లో తమ దౌత్య కార్యాలయాలు కొనసాగుతాయని రష్యా పేర్కొంది. తాలిబన్లను ఆప్ఘాన్ పాలకులుగా గుర్తించే విషయంలో తొందరపడబోమని తెలిపిన రష్యా వారి వైఖరిని నిశితంగా గమనిస్తామని అంటూనే తాలిబన్లతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు పనిచేస్తామని పేర్కొనడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

