Afghan women | బ్యూటీపార్లర్స్‌పై నిషేధం విధించిన తాలిబన్లు.. ఆగ్రహించిన ఆఫ్ఘన్ మహిళలు
Afghan women | ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా కొత్తకొత్త నిబంధనలను తీసుకొస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా బ్యూటీపార్లర్లపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్లు కొత్తగా మరో ఫర్మానా జారీచేశారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా కొత్తకొత్త నిబంధనలను తీసుకొస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా బ్యూటీపార్లర్లపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్లు కొత్తగా మరో ఫర్మానా జారీచేశారు.
ఆఫ్ఘాన్ సర్కారు తీరుపై ఆ దేశంలోని మహిళా లోకం మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో మహిళలు ఆందోళనకు దిగారు. తాలిబన్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో భద్రతాబలగాలు రంగంలోకి దిగారు. గాల్లోకి కాల్పులు జరిపి, భాష్పవాయు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
కాగా, ఆఫ్ఘన్ సర్కారు ఇప్పటికే తమ దేశంలోని మహిళలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీచేసింది. అంతేగాక పార్కుల్లో మహిళలకు ప్రవేశంపై నిషేధం విధించింది. అదేవిధంగా వివిధ వినోద కార్యక్రమాల్లో పాల్గొనకుండా కూడా మహిళలను తాలిబన్ సర్కారు కట్టడి చేసింది. ఆఫ్ఘన్ మహిళలు జిమ్‌లకు వెళ్లడంపై కూడా నిషేధం కొనసాగుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

