ఆఫ్ఘన్‌ను వీడేందుకు మహిళలకు బలవంతపు పెళ్లిళ్లు

కాబూల్: ఆప్ఘనిస్థాన్ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఆ దేశ మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల దేశం వీడిన కొందరు మహిళలు కాబూల్ ఎయిర్పోర్ట్ బయట బలవంతపు వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది. అమెరికా సైనిక విమానాల్లో వెళ్లేందుకు ఆఫ్ఘన్ మహిళలకు కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారాయి. మగ కుటుంబ సభ్యుల తోడు లేకుండా మహిళలు విమానాల్లో ప్రయాణించడాన్ని తాలిబన్లు నిషేధించారు.
ఈ నేపథ్యంలో ఒంటరి మహిళలు కాబూల్ ఎయిర్పోర్ట్ బయటే ఆ దేశం వీడే మగవారితో ఒప్పందపు వివాహాలు చేసుకున్నారు. ఆఫ్ఘన్ వీడేందుకు అర్హత ఉన్న పురుషులు భర్తలుగా నటించేందుకు మహిళల కుటుంబాలు డబ్బులు కూడా చెల్లించినట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా విమానాల్లో యూఏఈకి చేరిన పలువురు మహిళలు ఇలాంటి బలవంతపు లేదా ఒప్పంద వివాహాలు చేసుకున్నారని తెలిపింది.
కాగా, ఈ విధానంపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. మరోవైపు ఈ ముసుగులో ఆఫ్ఘన్ మహిళల అక్రమ రవాణాను గుర్తించేందుకు యూఏఈ అధికారులకు అమెరికా ప్రతినిధులు సహకరించనున్నారని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

