ఆఫ్ఘనిస్తాన్లో నైట్ కర్ఫ్యూ విధింపు

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని 31 ప్రావిన్సుల్లో అధికారులు నైట్ కర్ఫ్యూ విధించారు. తాలిబాన్ ఉగ్రవాదుల హింసాకాండను అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఆఫ్ఘాన్ అధికారులు శనివారం దేశంలోని 31 ప్రావిన్సులలో నైట్ కర్ఫ్యూ విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటకి వచ్చేందుకు అనుమతి నిరాకరణ. కాబూల్, తూర్పు నంగర్హార్ ప్రావిన్స్, ఉత్తర పంజ్షెర్ ప్రావిన్సులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపును ఇచ్చినట్లు ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా రాత్రి సమయంలోనే జరుగుతుంటాయని కావునా ఇటువంటి చర్యలు వారిని పరిమితం చేసేందుకు దారితీస్తాయన్నారు.
మొత్తం 31 ప్రావిన్సులలోని ప్రజలు నైట్ కర్ఫ్యూను పాటిస్తూ భద్రతా దళాలతో సహకరించాల్సిందిగా ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ ప్రతినిధి అహ్మద్ జియా జియా కోరారు. ఇటీవలి కాలంలో తాలిబాన్ ఉగ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. గత నాలుగు నెలల్లో దేశంలో 36 వేలకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. యుద్ధం కొనసాగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

