Trump Attacker | ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ఉన్నత విద్యావంతుడే.. కానీ..!
Trump Attacker | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాల్గొన్న వైట్‌హైస్ కరస్పాండెంట్స్ డిన్నర్ (White House Correspondents Dinner) మీట్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు ఒక ఉన్నత విద్యావంతుడిగా వెల్లడైంది. అతడిని దర్యాప్తు బృందాలు 31 ఏళ్ల కోలో టామోస్ అలెన్ (Cole Tomas Allen) గా గుర్తించాయి. కాలిఫోర్నియా (California) లోని లాస్ ఏంజెలెస్ శివార్లలో ఉన్న టోరెన్స్ ప్రాంత వాసిగా గుర్తించారు.
Trump Attacker : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాల్గొన్న వైట్‌హైస్ కరస్పాండెంట్స్ డిన్నర్ (White House Correspondents Dinner) మీట్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు ఒక ఉన్నత విద్యావంతుడిగా వెల్లడైంది. అతడిని దర్యాప్తు బృందాలు 31 ఏళ్ల కోలో టామోస్ అలెన్ (Cole Tomas Allen) గా గుర్తించాయి. కాలిఫోర్నియా (California) లోని లాస్ ఏంజెలెస్ శివార్లలో ఉన్న టోరెన్స్ ప్రాంత వాసిగా గుర్తించారు. అతడి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ (Engineering Degree) పూర్తి చేశాడు.
థామస్ అలెన్ 2017లో కాల్టెక్లో విద్యార్థిగా ఉన్నప్పుడే వీల్ఛైర్స్కు ఎమర్జెన్సీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా రూపొందించాడు. ఈ అంశం గురించి స్థానిక పత్రికలో కథనం కూడా వెలువడింది. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిశాడు. 2018లో ఓ వీడియోగేమ్‌ను కూడా తయారు చేసి ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసుకొన్నాడు. ఇటీవల ‘ఫస్ట్‌లా ’ పేరిట మరో గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డిన్లో వెల్లడించాడు. 2014లో జెట్ ప్రొపెల్షన్ ల్యాబ్‌లో నాసా నిర్వహించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో కూడా అతడు పాల్గొన్నాడు.
ప్రస్తుతం టెస్ట్ ప్రిపరేషన్ ట్యూటరింగ్ కంపెనీ సీ2 ఎడ్యూకేషన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు ప్రొఫైల్‌లో ఉంది. డిసెంబర్ 2024లో టీచర్ ఆఫ్ ది మంత్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇక రాజకీయ నేపథ్యం చూస్తే.. డెమోక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడిగా తెలుస్తోంది. కమలా హ్యారిస్ అధ్యక్ష ప్రచారానికి 25 డాలర్లు విరాళం కూడా ఇచ్చినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెబుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

