Shocking news | గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే కొడుకును కన్న మహిళ..!
Shocking news | ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తాను గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డను కన్నది. అంతేకాదు
Shocking news: సాధారణంగా బిడ్డను కనాలంటే తల్లి తన గర్భంలో నవమాసాలు మోయాలి. అంతకంటే ఒక్క నెల ముందు బిడ్డను కన్నా ఆ బిడ్డ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తాను గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డను కన్నది. అంతేకాదు తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ న్యూస్ షాకింగ్‌గా ఉంది కదా..! ఒక మహిళ గర్భం దాల్చినట్లు తెలుసుకున్న రెండు రోజుల్లోనే బిడ్డను కనడం ఏమిటని ఆశ్యర్యపోతున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం..
అమెరికాకు చెందిన 23 ఏండ్ల పేటన్ స్టోవర్ తన భర్తతో కలిసి ఒమాహాలో నివాసం ఉంటున్నది. అక్కడి ఓ విద్యాసంస్థలో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నది. ఇటీవల ఆమెకు తల తిరిగినట్లుగా, వాంతికి వచ్చినట్లుగా అనిపించింది. అయితే పని ఒత్తిడివల్ల కావచ్చని లైట్ తీసుకుంది. కానీ, క్రమంగా బాడీలో మార్పులు మొదలయ్యాయి. కాళ్లలో వాపు వచ్చింది. దాంతో భయపడిపోయిన స్టోవర్ వైద్యులను సంప్రదించింది.
పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పారు. కానీ, స్టోవర్ నమ్మలేదు. మరోసారి పరీక్షలు చేయించుకున్నది. ఆ పరీక్షల్లో కూడా ఆమె గర్భిణి అని తేలింది. అయినా నమ్మకం కుదరకపోవడంతో అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుంది. కడుపులో బిడ్డ ఉన్నట్లు స్కానింగ్‌లో క్లియర్‌గా కనిపిచడంతో తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు నమ్మింది. పైగా గర్భం వచ్చి ఆరు నెలలు దాటిందని వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ షాకయ్యారు.
అంతేగాక, ప్రెగ్నెన్సీతోపాటు అత్యంత అరుదుగా వచ్చే ప్రీక్లామ్‌ప్సియా అనే రుగ్మత స్టోవర్లో ఉందని, దీనివల్ల బీపీ ఎక్కువై కిడ్నీలు, కాలేయం పనితీరు మందగిస్తుందని, ఇది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలపడంతో స్టోవర్ దంపతులు భయంతో వణికిపోయారు. వైద్యుల సూచన మేరకు వెంటనే ఆస్పత్రిలో చేరగా.. 48 గంటల్లో సర్జరీ చేసి తల్లీబిడ్డ ఇద్దరినీ కాపాడారు. ఆమెకు ఒక కిలో 800 గ్రాముల బరువుతో మగబిడ్డ జన్మించాడు.
అయితే, డెలివరీకి రెండు రోజుల ముందు దాకా కూడా తమ ఇంట్లో బిడ్డ అడుగుపెట్టడానికి చాలా సమయం పడుతుందన్న భావనలో ఉన్న ఆ దంపతులు.. 48 గంటల్లోనే కొడుకు పుట్టేసరికి సంబ్రమాశ్యర్యాలకు లోనయ్యారు. ఇది కలా, నిజమా అని ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఆరు నెలల గర్భిణి అయినా స్టోవర్ పొట్ట లావుగా బయటికి కనిపించకపోవడానికి ప్రీక్లామ్‌ప్సియా కారణం అయివుండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటివి అత్యంత అరుదుగా సంభవిస్తాయని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

