ఓ విమానం ఆకాశంలో ఆగిపోయింది. గాలిలో తేలియాడుతున్నది. ఈ విమానం వింత కెమెరాకు చిక్కింది. ఈ క్లిప్ టిక్‌టాక్‌లో వైరల్ అయ్యింది. అనంతరం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై చక్కర్లు కొట్టింది. కారులో వెళ్తున్న వ్యక్తి ఈ విమానాన్ని వీడియో తీశాడు. తాను కారులో ముందుకు కదులుతున్నానని, కానీ, విమానం ఆకాశంలో అక్కడే ఉండిపోయిందని వీడియోలో ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
ఇలాంటి దృగ్విషయం కెమెరాకు చిక్కడం, నెటిజన్లను షాక్‌కు గురిచేయడం ఇదే మొదటిసారి కాదు. ‘వైరల్హగ్’ షేర్ చేసిన మరో వీడియోలో కదులుతున్న కారులో కూర్చున్న వ్యక్తి వ్యతిరేక దిశలో వెళ్తున్న విమానాన్ని బంధించాడు. ఆ విమానం ఏ మాత్రం కదలడం లేదు. డల్లాస్/ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇలాంటి వీడియో ఒకటి వెలుగుచూసింది. ఈ వీడియో 2018లో యూట్యూబ్‌లో కనిపించింది.
అయితే, దీని వెనుక సైన్స్ దాగి ఉందని నిపుణులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆకాశంలో చిక్కుకున్నట్టు కనిపించే విమానాలు ‘ఆప్టికల్ ఇల్యూజన్’ అని తెలిపారు. ‘విమానాలు తరచూ ఎదురుగాలి, టెయిల్ విండ్ గుండా వెళ్తాయి. ఒక టెయిల్విండ్ విమానం దిశలో వీస్తున్నప్పుడు, విమానం కదిలే దిశకు వ్యతిరేకంగా ఎదురుగాలి వీస్తుంది. చాలా బలమైన ఈదురు గాలుల కారణంగా విమానాలు గాల్లోనే ఆగిపోయినట్టు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి చాలా చాలా నెమ్మదిగా కదులుతాయి.’ అని వివరించారు.