గాల్లోనే 11 రోజులు.. 13,500 కిలోమీటర్లు.. ఓ పక్షి గిన్నిస్ రికార్డు
Bar Tailed Godwit Bird | బార్ టెయిల్డ్ గాడ్విట్ బర్డ్..! దీని శాస్త్రీయ నామం 'లిమోసా లప్పోనికా'..! ఇది వలస పక్షుల్లో ఒక రకం..! సాధారణంగా ఈ పక్షులు ఆగకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు..! కానీ
న్యూఢిల్లీ: బార్ టెయిల్డ్ గాడ్విట్ బర్డ్..! దీని శాస్త్రీయ నామం ‘లిమోసా లప్పోనికా’..! ఇది వలస పక్షుల్లో ఒక రకం..! సాధారణంగా ఈ పక్షులు ఆగకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు..! కానీ ఇటీవల ఓ గాడ్విట్ బర్డ్ మాత్రం 11 రోజులపాటు 13 వేల కిలోమీటర్లకు పైగా దూరం ఆగకుండా ప్రయాణించి రికార్డు సృష్టించింది..! గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది..! అమెరికా రాష్ట్రం అలస్కాలో బయలుదేరిన ఆ పక్షి.. 11 రోజుల తర్వాత ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు చేరుకుని అందరి చేత ‘హౌరా..!’ అనిపించింది..!
ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. గత ఏడాది అక్టోబర్ 13న 234684 టాగ్ నెంబర్‌తో ఉన్న పక్షి అమెరికాలోని అలస్కా రాష్ట్రం నుంచి బయలుదేరింది. అలస్కాలో గాల్లోకి ఎగిరింది మొదలు అలసటను భరిస్తూ.. ఆకలి దప్పికలను జయిస్తూ.. పదకొండున్నర రోజులపాటు గాల్లోనే పయనిస్తూ.. 13,560 కిలోమీటర్ల (8,435 మైళ్లు) సుదీర్ఘ ప్రయాణం చేసి.. ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రంలో కిందకు దిగింది. దాంతో 2020లో మరో గాడ్విట్ పక్షి పేరిట ఉన్న 217 మైళ్ల ప్రయాణ దూరం రికార్డును తిరగరాసింది.
పక్షి వీపునకు దిగువన తోక భాగానికి కొద్దిగా పైన అమర్చిన 5జీ శాటిలైట్ ట్యాగ్ ద్వారా దాని ప్రయాణదూరాన్ని రికార్డు చేశారు. ఈ పక్షి ప్రయాణించిన దూరం లండన్, న్యూయార్క్ నగరాల మధ్య రెండున్నర ట్రిప్పులకు సమానమని, భూ గ్రహం చుట్టుకొలతలో 1/3వ వంతు అని గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు. రేయింబవళ్లు ప్రయాణించడం ద్వారా గాడ్విట్ బర్డ్ తన బరువులో సగానికిపైగా కోల్పోయిందని టాస్మానియాకు చెందిన పక్షి సంరక్షకుడు ఎరిక్ వోహ్లర్ చెప్పారు.
నీళ్లపై వాలితే మరణమే..
ఇతర పక్షులు వలస వెళ్తూ మార్గమధ్యలో నీటి ఉపరితలాలపై వాలుతూ ఆహారం తీసుకుంటాయి. కానీ గాడ్విట్ బర్డ్ నీటి ఉపరితలం వాలితే ప్రాణాలు కోల్పోతుంది. ఎందుకంటే ఈ పక్షుల కాలి వేళ్ల మధ్య చర్మం లేకపోవడంవల్ల అవి నీటి ఉపరితలంపై వాలితే మునిగిపోతాయి. అందుకే సముద్రాల మీదుగా వలస వెళ్లేటప్పుడు అలసిపోవడం కారణంగానో, ప్రతికూల వాతావరణం కారణంగానో నీళ్లలో పడితే ఆ పక్షి ప్రాణాలు హరీమంటాయి.
అలస్కా నుంచి టాస్మానియా వరకు పూర్తిగా సముద్ర మార్గమే కావడం, మధ్యలో ఎక్కడా వాలే అవకాశం లేకపోవడంతో గాడ్విట్ బర్డ్ తప్పనిసరి పరిస్థితుల్లో సుదీర్ఘ ప్రయాణం చేసి ఉంటుంది. ఆకలి వేసిందనో.. దప్పికగా ఉందనో.. అలసట వచ్చిందనో.. సముద్ర ఉపరితలంపై వాలితే ప్రాణాలే పోతాయి. అందుకే అన్నింటిని భరిస్తూ ఆ పక్షి ముందుకే సాగి ఉంటుంది. దీన్నిబట్టి 11 రోజులపాటు ఆ గాడ్విట్ ఎంత యాతనను తట్టుకోవాల్సి వచ్చిందో ఊహించవచ్చు. హాట్సాఫ్ గాడ్విట్.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

