Air Canada | ఎయిర్ కెనడా అమానుషం.. దివ్యాంగుడిపై కనికరం చూపని వైనం..!
Air Canada | దివ్యాంగుడైన ఓ ప్రయాణికుడి పట్ల ఎయిర్ కెనడా (Air Canada) విమాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. బ్రిటిష్ కొలంబియా (British Columbia) కు చెందిన రోడ్నీ హాడ్గిన్స్ (Rodney Hodgins) అనే వ్యక్తి స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి కారణంగా అతడు నడవలేడు. వీల్‌ఛైర్ (wheel chair) సాయం ఉంటే తప్ప కదలలేని పరిస్థితి.
ఒట్టావా: దివ్యాంగుడైన ఓ ప్రయాణికుడి పట్ల ఎయిర్ కెనడా (Air Canada) విమాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. బ్రిటిష్ కొలంబియా (British Columbia) కు చెందిన రోడ్నీ హాడ్గిన్స్ (Rodney Hodgins) అనే వ్యక్తి స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి కారణంగా అతడు నడవలేడు. వీల్‌ఛైర్ (wheel chair) సాయం ఉంటే తప్ప కదలలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆయన తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా గత ఆగస్టులో భార్య డీనా హాడ్గిన్స్తో కలిసి లాస్ వెగాస్ ( Las Vegas) కు వెళ్లాడు.
విమానం లాస్ వెగాస్‌లో ల్యాండ్ అయిన అనంతరం కిందకు దిగేందుకు తనకు వీల్‌ఛైర్ కావాలని సిబ్బందిని కోరాడు. కానీ, తమ వద్ద వీల్‌ఛైర్ లేదని, మీరే దిగిపోవాలని సిబ్బంది బదులిచ్చారు. దాంతో చేసేది లేక రోడ్నీ తన వీపుతో కదులుతూ జారుతుంటే ఆయన భార్య డీనా కాళ్లు పట్టుకుని కిందకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో దంపతులిద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. ఎయిర్ కెనడా తమపట్ల ప్రవర్తించిన తీరును డీనా తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణించాం. విమానం ల్యాండింగ్ అనంతరం సిబ్బంది వీల్‌ఛైర్ లేదని చెప్పారు. ముందుగా వారు సరదాగా అంటున్నారని భావించాం. కానీ, విమానం టేకాఫ్‌కు ముందు వీల్‌ఛైర్‌ను ఫ్లైట్‌లో పెట్టుకోవడం మర్చిపోయామని చెప్పారు’ అని డీనా తన సోషల్ మీడియాలో పోస్టులో పేర్కొన్నారు. దివ్యాంగుడైన తన భర్త హక్కులకు ఎయిర్ కెనడా సిబ్బంది భంగం కలిగించారన్నారు.
తమ శరీరాలకు తగిలిన గాయాల కంటే మనసుకు జరిగిన అవమానమే తమను ఎక్కువగా బాధిస్తోందని డీనా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎయిర్ కెనడా స్పందించింది. తమ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయని, రోడ్నీ హాడ్గిన్స్ ఎదుర్కొన్న పరిస్థితి తలెత్తడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. జరిగిన తప్పిదానికి రోడ్నీ దంపతులను క్షమాపణ కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

