అట్లాంటా: అమెరికాలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ముందు భాగాన ఉండే నోస్‌వీల్ ఊడిపోవడంతో వెంటనే అప్రమత్తమై టేకాఫ్‌ను నిలిపివేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కొలంబియాలోని బొగటాకు వెళ్లేందుకు బోయింగ్ 757 విమానం సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు.