రెండేళ్ల వయసులో కిడ్నాప్.. 24 ఏళ్ల తర్వాత తండ్రి వద్దకు కొడుకు

బీజింగ్ : చైనాలో పిల్లల్ని ఎత్తుకుపోయే ఘటనలు ఎక్కువగా నమోదు అవుతుంటాయి. ఓ తండ్రి తప్పిపోయిన తన కుమారిడి కోసం సుమారు 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరకు 24 ఏళ్ల తర్వాత కుమారుడి ఆచూకీ చిక్కింది. ఈ ఘటన చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్సులో జరిగింది. గువా గాంగ్‌టాంగ్ కుమారుడు రెండేళ్ల వయసులో అపహరణకు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా పిల్లవాడి ఆచూకీ గుర్తించినట్లు తాజాగా పబ్లిక్ సెక్యూర్టీ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. నిజానికి తన కుమారుడి కోసం గువా గాంగ్‌టాంగ్ దాదాపు 20 ప్రావిన్సుల్లో తిరిగాడు. 1997లో రెండేళ్ల వయసులో పిల్లవాడు అపహరణకు గురయ్యాడు. అప్పటి నుంచి కొడుకు కోసం అతను దేశమంతా ప్రయాణించాడు. ఆ సమయంలో అనేక వడిదిడుకులను ఎదుర్కొన్నాడు. గువా గాంగ్‌టాంగ్ కథ ఆధారంగా 2015లో ఓ సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో హాంగ్‌కాంగ్ సూపర్‌స్టార్ ఆండీ లువా నటించారు. చైనాలో ప్రతి ఏడాది సుమారు 20 వేల మంది చిన్నారులు అపహరణకు గురవుతున్నట్లు 2015 డేటా ప్రకారం తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

