ఆదివారం 31 మే 2020
International - Apr 29, 2020 , 09:04:37

క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్న‌‌ 98 ఏళ్ల డాక్ట‌ర్‌

క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్న‌‌ 98 ఏళ్ల డాక్ట‌ర్‌

హైద‌రాబాద్‌: ఫ్రాన్స్‌కు చెందిన 98 ఏళ్ల డాక్ట‌ర్‌.. క‌రోనా రోగుల‌కు చికిత్స‌ను అందిస్తున్నాడు.  పారిస్‌లోని స‌బ‌ర్బ‌న్ ఏరియాలో ఉండే డాక్ట‌ర్ క్రిస్టియ‌న్ చెనాయ్‌.. వృద్ధాప్యంలోనూ వైద్య వృత్తిని కొన‌సాగిస్తున్నాడు.  కోవిడ్‌19 నేప‌థ్యంలో చాలా ప్రమాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉన్నా.. ఆయ‌న మాత్రం పారిస్ ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తూ త‌న క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తున్నాడు. ఫ్రాన్స్‌లో అతిపురాత‌న డాక్ట‌ర్‌గా గుర్తింపు ఉన్న‌ క్రిస్టియ‌న్ చెనాయ్ ఇప్పుడు వ‌ర్చువ‌ల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు.  ఇటీవ‌ల క్వారెంటైన్ పూర్తి చేసుకున్న చెనాయ్‌.. త‌న పేషెంట్ల‌కు ఫోన్ ద్వారా చికిత్స అందిస్తున్నాడు. స్థానికంగా ఫ్యామిలీ డాక్ట‌ర్లు క‌రువైన నేప‌థ్యంలో.. ఆయ‌న మాత్రం త‌న పాత పేషెంట్ల‌ను ఇంకా ఆక‌ట్టుకుంటూనే ఉన్నాడు.  దాదాపు 70 ఏళ్ల నుంచి ఆయ‌న వైద్య వృత్తిలో ఉన్నాడు.  రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో్ టైఫ‌స్ వ్యాధి సోకిన‌ప్పుడు .. డాక్ట‌ర్ చెనాయ్ అప్ప‌ట్లో పేషెంట్ల‌కు కూడా ట్రీట్మెంట్ ఇచ్చాడు.  అప్పుడు వాళ్లు గ్యాస్ మాస్క్‌లు ధ‌రించి చికిత్స అందించారు. ఇప్పుడు కోవిడ్ బాధితుల‌కు కూడా వైద్యం చేస్తున్నాడు. 

 logo