షాంఘైలో 70 శాతం మందికి కోవిడ్ ఇన్ఫెక్షన్
Shanghai Covidచైనాలోని షాంఘై నగరంలో ప్రస్తుతం హాస్పిటళ్లు కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఆ నగరంలో దాదాపు 70 శాతం మందికి కోవిడ్ సోకి ఉంటుందని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. డిసెంబర్లో కోవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత అక్కడ భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో హాస్పిటళ్లు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. రుయిజిన్ హాస్పిటల్ వైస్ ప్రె
షాంఘై: చైనాలోని షాంఘై నగరంలో ప్రస్తుతం హాస్పిటళ్లు కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఆ నగరంలో దాదాపు 70 శాతం మందికి కోవిడ్ సోకి ఉంటుందని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. డిసెంబర్లో కోవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత అక్కడ భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో హాస్పిటళ్లు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి.
రుయిజిన్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్, షాంఘై కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జన్ దీనిపై మాట్లాడారు. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజల్లో.. చాలా మందికి వైరస్ సోకి ఉంటుందన్నారు. ఆ నగరంలో ప్రస్తుతం వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, జనాభాలో 70 శాతం మందికి ఆ వైరస్ సోకి ఉంటుందని, గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుందన్నారు.
గత ఏప్రిల్‌లో షాంఘైలో కఠిన రీతిలో లాక్డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో సుమారు ఆరు లక్షల మందికి వైరస్ సోకింది. భారీ స్థాయిలో క్వారెంటైన్ సెంటర్లలో వాళ్లను లాక్ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. నగరంలో ఆ వేరియంట్ జోరుగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆ ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బీజింగ్, తియాంజిన్, చాంగ్కింగ్, గాంగ్జూ లాంటి నగరాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయి. రుయిజిన్ హాస్పిటల్లో ప్రతి రోజు 1600 ఎమర్జెన్సీ అడ్మిషన్లు జరుగుతున్నట్లు చెన్ ఎర్జన్ తెలిపారు. ప్రతి రోజు హాస్పిటల్‌కు వంద అంబులెన్సులు వస్తున్నట్లు చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమర్జెన్సీ విభాగంలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

