Sperm Donor: ఆస్ట్రేలియాలో వీర్య కణాల దానం.. 60 మంది చిన్నారులకు ఒక్కడే తండ్రి
sperm donor: ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి వీర్యకణాలు దానం చేశాడు. దాని వల్ల అతనికి 60 మంది పిల్లలు పుట్టినట్లు తెలుస్తోంది. షాకింగ్ విషయాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. 60 మంది చిన్నారులకు తండ్రి ఒక్కడే అని తేలింది. వీర్య కణాలు దానం((sperm donation) చేసిన ఆ వ్యక్తి పేరును అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇండిపెండెంట్ మీడియా ఓ కథనాన్ని రాసింది. ఇంతకీ ఈ గమ్మత్తు ఎలా బయటపడిందో తెలుసుకుందాం. ఎల్జీబీటీ వర్గానికి చెందిన పేరెంట్స్ అందరూ ఓ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అక్కడకు పిల్లలతో పేరెంట్స్ వచ్చారు. అక్కడకు వచ్చిన పిల్లల్లో అందరూ దాదాపు సేమ్‌గా కనిపించారు. పిల్లలు ఒకేలాగ ఉండడం గమనించి పేరెంట్స్ షాకయ్యారు. దీంట్లో ఏదో తేడా ఉందని గమనించి ఆ కోణంలో ఆరా తీశారు. ఆస్ట్రేలియాలో ఉన్న అన్ని ఐవీఎఫ్ క్లినిక్‌లను సంప్రదించారు.
ఆ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అన్ని సెంటర్లలో వీర్య కణాలు డోనేట్ చేసన వ్యక్తి ఒక్కడే అని తెలిసింది. నాలుగు పేర్లతో అతను తన వీర్య కణాలను దానం చేసినట్లు గుర్తించారు. స్పెర్మ్ డోనార్ సెంటర్లు అన్నీ అతని వద్ద నుంచి వీర్య కణాల్ని సేకరించినట్లు భావిస్తున్నారు. ఫెర్టిలిటీ ఫస్ట్ క్లినిక్ డాక్టర్ అన్నే క్లార్క్ ఈ ఘటనపై ఓ ప్రకటన చేశారు. తమ క్లినిక్‌కు ఆ వ్యక్తి ఒకసారి వచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ అనధికార పద్ధతుల్లో ఆ వ్యక్తి తన స్పెర్మ్‌ను డొనేట్ చేసినట్లు ఆమె చెప్పారు.
నిజానికి ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం స్పెర్మ్ డోనేషన్ నేరం. గిఫ్ట్‌లు తీసుకుని వీర్య కణాల ఇవ్వడం కూడా నిషేధం. అక్రమ పద్ధతిలో వీర్య కణాలను డోనేట్ చేయడం వల్ల అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు లేని వారు నేరుగా డోనార్‌ను కలవడం వల్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

