El Salvador | ఎల్సాల్వడార్లో భారీ భూకంపం.. 6.5 తీవ్రత
లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్లో (El Salvador) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం తీరంలోని (Pacific coast) ఎల్ ఎల్వడార్ ప్రాదేశిక జలాల్లో భూమి కంపించింది.
సాన్ సాల్వడార్: లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్లో (El Salvador) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం తీరంలోని (Pacific coast) ఎల్ ఎల్వడార్ ప్రాదేశిక జలాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.5గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. దేశ రాజధాని సాన్ సాల్విడార్కు (San Salvador) సమీపంలోని సముద్ర తీర పట్టణమైన లా లిబర్టెడ్లో (La Liberted) కూడా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిళ్ల లేదని, సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు.
కాగా, పసిఫిక్ తీరంలో భూకంపం ప్రభావంతో నికరాగువా, హోండురస్, గ్వాటెమాలా, బ్రెజిల్లో కూడా స్వల్పంగా కదలికలు సంభవించాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు (Tsunami warning) జారీచేయలేదన్నారు.
గత ఆదివారం అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. అలస్కా పరిధిలోని పెనిన్సులా ప్రాంతంలో దీని ప్రభావం కనిపించింది. దీంతో జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూకంప కేంద్రం 9.3 కి.మీ లోతులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

