ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా | ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్

జకార్తా : ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే సునామీ హెచ్చరిక జారీ కాలేదు. తూర్పు జావాలోని మలంగ్ నగరానికి నైరుతి దిశలో 45 కిలోమీటర్ల దూరంలో 82 కిలోమీటర్ల (50 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. అయితే భూకంప ప్రమాదానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప ధాటికి మలంగ్ నగరం షాక్‌కు గురైంది. మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సులవేసి ద్వీపంలోని పలులో 2018లో సంభవించిన భూకంప ధాటికి, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొందరు గల్లంతు అయ్యారు. నాడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. 2004, డిసెంబర్ 26న సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ రావడంతో 2,20,000 మంది చనిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్రజలు 1,70,000 ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

