రైలు ప్రమాదం.. 48కి చేరిన మృతుల సంఖ్య

హువాలియన్: తైవాన్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 48కి చేరుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 బోగీలతో వెళ్తున్న ఆ రైలు.. ఓ టన్నెల్ వద్ద వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్‌పై నిర్మాణ వాహనం అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ మధ్యలో నుజ్జు అయిన బోగీల్లో ప్రయాణికులు చిక్కుకున్నారు. వారిని రెస్కూ సిబ్బంది రక్షించింది. రాజధాని తైపి నుంచి టైటుంగ్కు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. రైలు కిక్కిరిసిపోవడంతో అనేక మంది ప్రయాణికులు నిలిచి ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు త్సాయి ఇంగ్ వెన్ సంతాపం తెలిపారు. ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. తైవాన్‌లో ప్రస్తుతం టాంబ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ రైలు ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుంది. పట్టాలు తప్పిన బోగీల నుంచి సుమారు వంద మంది ప్రయాణికులను రక్షించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాకింగ్‌షుయి టన్నెల్ వద్ద రైలు ప్రమాదం జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

