ఇండోనేషియా భూకంపం.. 46కు పెరిగిన మృతులు
earthquake | ఇండోనేషియాలో జక్తారాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భారీ ప్రకంపనల ధాటికి పెద్ద సంఖ్యలో భవనాలు నేలకూలగా.. పెద్ద ఎత్తున పగుళ్లు బారాయి. ప్రకంపనలతో 46 మంది ప్రాణాలు
జకార్తా : ఇండోనేషియాలో జక్తారాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భారీ ప్రకంపనల ధాటికి పెద్ద సంఖ్యలో భవనాలు నేలకూలగా.. పెద్ద ఎత్తున పగుళ్లు బారాయి. ప్రకంపనలతో 46 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు.. ఒకే ఆసుపత్రిలో 46 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో జకార్తాలో భూకంపం సంభవించిందని జియోఫిజిక్స్ ఏజెన్సీ పేర్కొంది.
పశ్చిమ జావాలోని సియాంజూర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. భారీ ప్రకంపలతో కార్యాలయాల్లో నుంచి ఉద్యోగులు, ఇండ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. పశ్చిమ ఇండోనేషియాలో గత శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించగా.. భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే, తీవ్రంగానే ప్రకంపనలు వచ్చినా ఎలాంటి నష్టం జరుగకపోవడం విశేషం కానీ. ఇవాళ 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

