సెనగల్లో రెండు బస్సులు ఢీ.. 40 మంది మృతి, 78 మందికి గాయాలు
Senegal | ఆఫ్రికా దేశమైన సెనగల్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సెనగల్లోని కఫ్రిన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది
దాకర్: ఆఫ్రికా దేశమైన సెనగల్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సెనగల్లోని కఫ్రిన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78 మంది గాయపడ్డారు. దేశంలోని ఒకటో నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపుతప్పి రోడ్డుకు అవతలివైపునకు దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి.

కాగా ఈ ఘటనపట్ల దేశ అధ్యక్షుడు మాక్కి సాల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు దేశంలో సంతాప దినాలు పాటించాలని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో త్వరలోనే సమవేశమవుతానని చెప్పారు.
అధ్వానమైన రోడ్లు, వాహనాల డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడంతో దేశంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గతంలో 2017లో రెండు బస్సులు ఢీకొనడంతో 25 మంది దుర్మరణం చెందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- africa
- bus accident
- Gnivy
- Kaffrine
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

