కాబూల్, డిసెంబర్ 25 : అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై విధిస్తున్న ఆంక్షల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. దేశ, అంతర్జాతీయ ఎన్జీవోల్లో మహిళలకు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆదివారం మూడు స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకాలాపాలను నిలిపివేశాయి.
సేవ్ ది చిల్డ్రన్, ది నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, కేర్ అనే మూడు సంస్థలు ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ కార్యకలాపాలను ఆపివేశాయి.