Suicide Bombing | తాలిబన్ పాలిత దేశం ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)లో ఆత్మాహుతి దాడి (Suicide Bombing) జరిగింది. గురువారం ఉదయం కాందహార్ (Kandahar) నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు స్వదేశీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు.
గురువారం ఉదయం 8 గంటల సమయంలో కొందరు స్థానికులు తమ జీతాలను తీసుకునేందుకు సెంట్రల్ కాందహార్ నగరంలోని న్యూ కాబూల్ బ్యాంక్ బ్రాంచ్ (New Kabul Bank branch) వెలుపల వేచి ఉన్నట్లు తెలిపారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Also Read..
Lok sabha elections | వికసిత్ భారత్ వాట్సప్ మెసేజ్లను వెంటనే ఆపేయండి.. కేంద్రానికి ఈసీ ఆదేశం
Jaggi Vasudev | సద్గురు ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన ఆయన కూతురు
Janhvi Kapoor | మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్.. వీడియో షేర్ చేసిన ఓరీ