ఆస్ట్రాజెనికాతో బ్లడ్ క్లాటింగ్.. కొత్తగా 25 కేసులు నమోదు

లండన్: ఆస్ట్రాజెనికా టీకాతో లింకు ఉన్న బ్లడ్ క్లాటింగ్‌కు సంబంధించి కొత్తగా 25 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆరోపణల నేపథ్యంలో పలు యురోపియన్ దేశాలు ఆస్ట్రాజెనికాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసింఏద. అయితే తాజా నివేదికతో బ్రిటన్‌లో బ్లడ్ క్లాటింగ్ కేసుల సంఖ్య మార్చి 24వ తేదీన నాటికి 30కి చేరుకున్నట్లు హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ పేర్కొన్నది. అయినా కానీ ఆస్ట్రాజెనికా టీకా వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నట్లు ఆ ఏజెన్సీ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ డెవలప్ చేసిన టీకాను ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాలకు ప్రస్తుతం యూరోప్‌లో ఆదరణ తగ్గింది. మార్చి 24వ తేదీ నాటికి మొత్తం కోటి 80 లక్షల మందికి ఆస్ట్రాజెనికా టీకా ఇచ్చామని, దాంట్లో కేవలం 30 మాత్రమే బ్లడ్ క్లాటింగ్ కేసులు నమోదు అయినట్లు ఆ ఏజెన్సీ చెప్పింది. తాజా నివేదిక ప్రకారం ఆరు లక్షల మందిలో ఒకరికి మాత్రమే రక్తం గడ్డకడుతున్నట్లు తేల్చారు. బ్రిటన్‌లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫైజర్, బయోఎన్‌టెక్ టీకాలతో మాత్రం ఇలాంటి కేసులు నమోదు కావడం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

